సోలో బ్రతుకే సో బెటర్ : రివ్యూ

December 25, 2020
img

కరోనా లాక్ డౌన్ తర్వాత డైరెక్ట్ గా థియేటర్ లో రిలీజ్ అయిన సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమాను సుబ్బు డైరెక్ట్ చేయగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. సినిమాలో సాయి ధరం తేజ్ కు జోడీగా నభా నటేష్ నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ : 

జీవితంలో ప్రేమ దోమా అనే ఫీలింగ్స్ కు తావిక్కకుండా సోలోగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటాడు విరాట్ (సాయి ధరం తేజ్). నారాయణ మూర్తిని స్పూర్తిగా తీసుకుని సోలోగానే ఉండిపోవాలని అనుకుంటాడు. అయితే అతను అల ఫిక్స్ అవడానికి విరాట్ మామయ్య రావు రమేష్ కారణం. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విరాట్ కు ఈవెంట్ మేనేజ్ మెంట్ లో జాబ్ కోసం హైదరాబాద్ వస్తాడు. అక్కడ పీఠల మీద పెళ్లి ఆపేసి విరాట్ ను ప్రేమిస్తున్నా అని చెప్పి వస్తుంది అమృత (నభా నటేష్). ఇంతకీ సోలోగా లైఫ్ ను లీడ్ చేయాలని కున్న విరాట్ లైఫ్ లో అమృత ఎవరు..? ఆమె ఎలా అతనికి దగ్గరయ్యింది..? సోలో లైఫె సో బెటర్ అనుకున్న విరాట్ అలానే ఉండగలిగాడా అన్నది తెలియాలంటే సినిమా చూస్తే అర్ధమవుతుంది.

విశ్లేషణ :

కొన్ని సినిమాలు కథగా రాసుకున్నప్పుడు బాగుంటాయి.. తెర మీదకు మాత్రం అంత ఇంప్రెసివ్ గా అనిపించవు.. అలా ఇంప్రెస్ చేయాలంటే బాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో కూడా పేపర్ మీద సూపర్ అనిపించిన కథను తెర మీదకు తెచ్చే సరికి రొటీన్ గా అనిపించింది.

దర్శకుడు సుబ్బు నేటితరం యువత ఆలోచనలను ఇంకా కొన్ని బ్యాచిలర్ అంశాలను తీసుకుని సినిమా చేశాడు. అయితే ఈ సినిమా విషయంలో అతను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడని చెప్పొచ్చు. సినిమాతో చెప్పాలనుకున్న పాయింట్ రావు రమేష్ తో చెప్పించాడు. 

ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగినా సెకండ్ హాఫ్ మాత్రం బోరింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా సాగదీశారని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత థియేటర్ లో సినిమా చూసిన ఆనందం ఉన్నా రొటీన్ కథ.. సాగదీసిన కథనంతో ప్రేక్షకులు మాత్రం పెద్దగా ఎంటర్టైన్ అవలేదని చెప్పొచ్చు.

నటన, సాంకేతిక వర్గం :

సినిమాలో విరాట్ పాత్రలో సాయి ధరం తేజ్ మెప్పించాడు. ప్రతి సినిమాలో చూపించిన ఈజ్ ఈ సినిమాలో కూడా చేశాడు. హీరోయిన్ నభా నటేష్ కూడా బాగా చేసింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించింది. రావు రమేష్ సినిమాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. ప్రతిరోజూ పండుగే సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబో ప్రేక్షకులను మెప్పించింది. వెన్నెల కిశోర్, సత్య కూడా ఇంప్రెస్ చేశారు. 

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. థమన్ మ్యూజిక్ ఓకే అనిపించింది. బిజిఎం బాగుంది. వెంకట్ దిలీప్ సినిమాటోగ్రఫీ అలరించింది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. అయితే సెకండ్ హాఫ్ ఇంకాస్త కత్తెరలు పడి ఉంటే బాగుండేది. బోగవల్లి ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో : సోలో బ్రతుకే సో బెటర్.. థియేటర్ లో చూశామన్న సంతృప్తి తప్ప.. మరేమి ఉండదు. 

రేటింగ్ : 2.5/5


Related Post