నిశ్శబ్ధం : రివ్యూ

October 02, 2020
img

కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో కొన్ని సినిమాలు ఓటిటి రిలీజ్ అవుతున్నాయి. నాచురల్ స్టార్ నాని నటించిన వి సినిమా ఆల్రెడీ ఓటిటి లో రిలీజ్ అవగా లేటెస్ట్ గా స్వీటీ అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమా అమేజాన్ ప్రైమ్ లో రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.    

కథ : 

48 ఏళ్ళ క్రితం ఉడ్ విల్లాలో ఓ హత్య జరుగుతుంది. ఆ విల్లాలో దెయ్యం ఉందని చెప్పి నాలుగు దశాబ్ధాలుగా ఎవరు అందులో ఉండేందుకు సాహసించరు. కాని ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఆంటోని (మాధవన్), సాక్షి (అనుష్క) ఆ విల్లాలోనే దిగుతారు. 48 ఏళ్ళ క్రితం జరిగినట్టుగానే మళ్ళీ ఆ విల్ల్లాలో ఆంతోని హత్యకు గురవుతాడు. మళ్ళీ కేసు మొదలవుతుంది. ఇంతకీ ఆంటోనిని చంపింది ఎవరు..? భయపడి పారిపోయిన సాక్షిని ఇంటరాగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్ మహా (అంజలి) దొరికిన ఆధారాలు ఏంటి..? సాక్షి ఫ్లాష్ బ్యాక్ కు ఈ హత్యకు సంబంధం ఏంటి అన్నది తెలుసుకోవాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సినిమా కథ.            

విశ్లేషణ :

ఓ థ్రిల్లర్ సినిమాలా మొదలు పెట్టిన దర్శకుడు హేమంత్ మధుకర్ మొదటి పది నిమిషాలు పర్వాలేదు అనిపించాడు. ఇక రాను రాను సినిమా మీద ఆసక్తి కలిగించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ వరకు ఇంటరాగేషన్ తో కొద్దిగా గ్రిప్పింగ్ తో వెళ్ళిన డైరక్టర్ సస్పెన్స్ రివీల్ చేసే టైం లో పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఓ సిల్లీ రీజన్ తో ఆంటోని కొంతమంది లేడీస్ ను చంపడం అతని మీద పగ బట్టి సాక్షి అతన్ని చంపడంతో సినిమా అయ్యబాబోయ్ అనిపించేస్తుంది. 

కథ కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచించిన దర్శకుడు కథనం మాత్రం పూర్తిగా నిరాశపరచాడు. సెకండ్ హాఫ్ మొత్తం ఆడియెన్స్ నిరుత్సాహ పడేలా చేసింది. ఇక క్లైమాక్స్ కూడా అంతే నీరసంగా ఉంటుంది. దర్శకుడు హేమంత్ మధుకర్ ఏమాత్రం ఆకట్టుకునేలా సినిమా చేయలేదు.

నటన, సాంకేతిక వర్గం :           

డెఫ్ అండ్ డమ్ పాత్రలో అనుష్క జస్ట్ ఓకే అనిపించింది. ఆమె ఈ సినిమా చేయడానికి ఎక్సయిట్ అయిన పాయింట్ ఏంటన్నది మాత్రం చెప్పడం కష్టం. మాధవన్ కూడా ఎందుకు ఒప్పుకున్నాడో అర్ధం కాలేదు. సినిమాలో ఆంటోని పాత్రలో ఆయన నటన సోసోగా ఉంది. అంజలి పోలీస్ ఆఫీసర్ గా పర్వాలేదు అనిపించింది. షాలిని పాండే పాత్ర కూడా సరిగా చూపించలేకపోయాడు డైరక్టర్. మైఖెల్ మ్యాడ్ సన్, సుబ్బరాజు పాత్రలు కూడా జస్ట్ ఓకే అనిపించాయి.  

షానైల్ డియో సినిమాటోగ్రఫీ ఒక్కటి సినిమాలో మెప్పించే అంశమని చెప్పొచ్చు. ఇక గోపి సుందర్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. డైరక్టర్ హేమంత్ మధుకర్ ఏమాత్రం ఆకట్టుకునే కథ, కథనాలు అందించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి.    


Related Post