'వి' మూవీ రివ్యూ

September 05, 2020
img

థియేటర్లు ఇప్పట్లో తెరచుకుని అవకాశం లేదని తెలిసి ఇప్పటికే చాలా సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. ఇక అదే దారిలో నాని, సుధీర్ బాబు నటించిన క్రేజీ మూవీ విని కూడా ఈరోజు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అమేజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం. 

కథ :

 సిటీలో మత కలహాల వల్ల జరిగిన గొడవలో డిసిపి ఆదిత్య తన ప్రాణాన్ని సైతం రిస్క్ చేసి 30 మందిని కాపాడతాడు. ఈ క్రమంలో అతనికి గ్యాలంటరీ అవార్డు ఇస్తారు. ఈ టైంలోనే అతన్ని ఛాలెంజ్ చేస్తూ ఇన్ స్పెక్టర్ ప్రసాద్ ను దారుణంగా హత్య చేస్తాడు ఒక కిల్లర్. డిసిపి ఆదిత్య నాకు నువ్వు కావాలి అని రాసి పెట్టి మరి ఇన్ స్పెక్టర్ ను దారుణంగా చంపేస్తాడు. తనని ఛాలెంజ్ చేసిన ఆ కిల్లర్ ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నంలో ఆదిత్య ఉండగా ఒక పార్టీలో మరో వ్యక్తిని హత్య చేస్తాడు. మరో ఇద్దరినీ కూడా చంపేస్తానని ఆదిత్యకు ఛాలెంజ్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ కిల్లర్ ఎవరు..? ఎందుకు ఈ వరుస హత్యలు చేస్తున్నాడు..? అతన్ని ఎలా పట్టుకున్నాడు అన్నదే సినిమా కథ. 

విశ్లేషణ :

నాని 25వ సినిమాగా వచ్చిన వి రొటీన్ కథ, కథనాలతోనే వచ్చింది. సినిమాలో నెగటివ్ రోల్ లో నాని ఇంప్రెస్ చేయగా సుధీర్ బాబు పోలీస్ పాత్రలో అదరగొట్టాడు. అయితే సినిమా కథ పాతదే అయినా దాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన విధానంలో ఫస్ట్ హాఫ్ వరకు గ్రిప్పింగ్ గా అనిపించినా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పేశాడు. కిల్లర్ చేసిన ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసిన డిసిపి ఆదిత్య అతను ఇచ్చిన క్లూస్ తోనే రీసర్చ్ చేయడం అంతగా ఇంప్రెస్ చేయలేదు. 

అంతేకాదు సెకండ్ హాప్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆర్మీ ఎపిసోడ్ ఆ తర్వాత సీన్స్ అన్ని ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ముందు సాంగ్ కూడా అనవసరంగా ఉందని అనిపిస్తుంది. ఫైనల్ గా ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు క్లైమాక్స్ బాగుండాలి ఆ విషయంలో కూడా డైరక్టర్ నిరాశపరిచాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే అవకాశం లేని నాని వి సైకో కిల్లర్ ద్వారా చూపించిన రాక్షసత్వం  ఎక్కువైంది. అది చేసేది నానినే అవడం అసలేమాత్రం యాక్సెప్ట్ చేయలేనిదిగా అనిపిస్తుంది.

నటన, సాంకేతిక వర్గం :

నాని నెగటివ్ పాత్రలో బాగానే చేశాడు. కొన్ని సార్లు నిజంగానే భయపెట్టించాడు. అయితే నాని లాంటి సాఫ్ట్ హీరో ఇలాంటి రోల్ చేసి సాహసం చేశాడని చెప్పాలి. విష్ణు పాత్రలో నాని ఇంప్రెస్ చేశాడు. సినిమాలో సుధీర్ బాబు చేసిన ఆదిత్య పాత్ర అలరిస్తుంది. విలో హీరో సుధీర్ బాబు అనే చెప్పాలి. ఇక నివేదా  పాత్ర జస్ట్ ఓకే అనిపిస్తుంది. అదితి రావు హైదరి తన పాత్రలో మెప్పించింది. ఇక మిగతా పాత్రలన్నీ సినిమాలో తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే సినిమా ఎక్కువ భాగం నాని, సుధీర్ ల మీదే నడుస్తుంది. మిగతా పాత్రలన్నీ ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అనిపిస్తుంది. 

ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే.. విందా సినిమాటోగ్రఫీ బాగుంది. అమిత్ త్రివేది సాంగ్స్ ఓకే.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెస్ చేసింది. డైరక్టర్ ఇంద్రగంటి కథ బాగానే రాసుకున్నా కథనం ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేదని అనిపించింది. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ కు ఎలాంటి ఢోకా లేదు. 

ఒక్కమాటలో :

నాని విలన్ గా.. సుధీర్ బాబు హీరోగా 'వి'ఫల ప్రయత్నం..!     


Related Post