కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఎన్‌సీ-24 వర్కింగ్ టైటిల్‌తో మొదలుపెట్టిన సినిమా మొదటి షెడ్యూల్ అప్పుడే పూర్తయింది. రెండో షెడ్యూల్ మొదలైనట్లు తెలియజేస్తూ ఎక్స్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ అభిమానులతో షేర్ చేసుకుంది చిత్ర బృందం.
ఈ సోషియో ఫ్యాంటసీ, అడ్వంచర్ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా శ్రీలీల లేదా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.