రామాయణ పరిచయం.. ఇంత గ్రాఫిక్స్ అవసరమా?

July 03, 2025


img

బాలీవుడ్‌ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా ‘రామాయణ’ సినిమాని ‘ది ఇంట్రడక్షన్’ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. 2.47 నిమిషాల నిడివి కలిగిన వీడియోలో రామాయణ గాధని పరిచయం చేసేందుకు గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించుకున్నారు. 

యావత్ దేశ ప్రజలకు తెలిసిన రామాయణ గాధని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కో దర్శకుడు ఒక్కోలా పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో దానిని సినిమాకి ఉపయోగించుకుంటున్నారు. మంచిదే.. కానీ అవసరానికి మించిన గ్రాఫిక్స్ సినిమా మూల రూపాన్ని, ఆధ్యాత్మిక భావనని కనిపించకుండా చేసేస్తున్నాయి.

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఆదిపురుష్ అలాగే దెబ్బ తింది. కనుక మళ్ళీ ఎవరూ అటువంటి ప్రయత్నాలు చేయారనుకుంటే ఇప్పుడు ‘రామాయణ’ కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే కేవలం సినిమా పరిచయం చూసి ఈవిదంగా అనుకోవడం తొందరపాటే అవుతుంది.        

ఈ సినిమాలో సీతారాములుగా సాయి పల్లవి, రణదీర్ కపూర్, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణాసురుడిగా కన్నడ నటుడు యశ్, శూర్పణకగా రరకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారాదత్తా నటించారు. 

నితీశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని ప్రైమ్‌ ఫోకస్ స్టూడియోస్ బ్యానర్‌పై నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఎనిమిది సార్లు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డిఎన్ఈజీ వీఎఫ్ఎక్స్ స్టూడియో ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తోంది. 

ఈ సినిమాకు కధ: శ్రీధర్ రాఘవన్, సంగీతం: హన్స్ జిమమార్, ఏఆర్‌ రహమాన్ చేస్తున్నారు. ,     

రెండు భాగాలుగా తీస్తున్న ఈ సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కాబోతున్నాయి. 


Related Post

సినిమా స‌మీక్ష