భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో నేడే

May 25, 2025


img

నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ కలిసి నటించిన ‘భైరవం’ ఈ నెల 30న విడుదల కాబోతోంది. కనుక ఇవాళ్ళ (ఆదివారం) సాయంత్రం హైదరాబాద్‌, ‘పార్క్ హయత్’లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగబోతోంది. 

విజయ్ కనకమేడల దర్శకత్వంలో ముగ్గురు యువహీరోలు కలిసి చేస్తున్న ‘భైరవం’పై చాలా ఆశలు పెట్టుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు జూన్ 1 నుంచి బంద్ ప్రకటించడం, మరోపక్క ప్రభాస్‌ అభిమానులు ‘బాయ్‌కలెక్టర్‌ భైరవం’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టడంతో భైరవంకు ముచ్చమటలు పట్టాయి.

కానీ ఏపీ సిఎం పవన్ కళ్యాణ్‌ జోక్యం చేసుకోవడంతో థియేటర్స్ బంద్ ప్రకటన ఉపసంహరించుకున్నారు. మంచు మనోజ్ ప్రభాస్‌ అభిమానులకు క్షమాపణ చెప్పుకొని భైరవంని గట్టెకించుకునే ప్రయత్నం చేశారు. బహుశః నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మళ్ళీ మరోసారి క్షమాపణలు చెప్పుకుంటారేమో? 

భైరవంలో ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు. జయసుధ, అజయ్, రాజా రవీంద్ర, సంపత్ రాజ్, సనీడప రాజ్, వెన్నెల కిషోర్, శరత్ లోహితస్వ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి దర్శకత్వం, స్క్రీన్ ప్లే: విజయ్ కనకమేడల, కెమెరా: హరి కే వేదాంతం, డైలాగ్స్: సత్యశ్రీ, తూం వెంకట్, పాటలు: భాస్కరభట్ల, కాశర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి జావన, సంగీతం: శ్రీచరణ్ పాకాల, స్టంట్స్: రామకృష్ణన్, నటరాజ మాదిగొండ, ఎడిటింగ్: చోట కే ప్రసాద్ చేస్తున్నారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకే రాధామోహన్ నిర్మించిన భైరవం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష