మాడిడాల ఎంఆర్ కృష్ణ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా ‘వచ్చినవాడు గౌతమ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా టీజర్ నేడు విడుదల చేశారు. “ధర్మం దారి తప్పినప్పుడు ఏ అవతారం రానప్పుడు వచ్చినవాడు గౌతమ్..” అనే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మిస్టరీ యాక్షన్ మూవీలో రియా సుమన్, ఆయేషా ఖాన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అజయ్, మురళీ శర్మ, సాయి రోనక్, సచిన్ ఖేడెకర్, అభినయ, షకలక శంకర్, వైవా రాఘవ, తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మాడిడాల ఎంఆర్ కృష్ణ, సంగీతం: గౌర హరి, కెమెరా: ఎం ఎన్ బాల్‌రెడ్డి, ఎడిటింగ్: ఎం ఆర్ ప్రశాంత్ వర్మ, స్టంట్స్: పృధ్వీ, రామకృష్ణ, ఆర్ట్: సురేష్ భీమగని చేస్తున్నారు.
@అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టి. గణపతి రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. టీజర్ వచ్చేసింది కనుక త్వరలోనే సినిమా కూడా విడుదల కాబోతోంది.