ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మంచి నటుడు కూడా. కాదల్, బ్యాచిలర్, తాజాగా విడులైన కింగ్‌స్టన్ సినిమాలలో నటించి మెప్పించారు. తాజాగా ఆయన మరో సినిమాలో నటించబోతున్నారు.
కోలీవుడ్ దర్శకుడు మరియప్పన్ దర్శకత్వంలో ఏకే ప్రొడక్షన్ నం.2గా అరుణ్ కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ కుమార్‌కి జోడీగా కాయాడు లోహర్ నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ తలుపు తాళం చెవి దూర్చే కన్నంలో నుంచి ఓ వ్యక్తి తొంగి చూస్తున్న పోస్టర్ వేసి, దాని కింద ప్రతీ తలుపు ఓ కధని దాచి ఉంచుతుంది,” అని క్యాప్షన్ పెట్టారి.
ఈ సినిమా ఫస్ట్-లుక్ ఈ నెల 9 వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లు దానిలో పేర్కొన్నారు. అప్పుడే ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.