శైలేష్ కొలను దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా ‘హిట్-3’ సినిమా మే 1వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. ఈ యాక్షన్ సినిమాలో నాని అరాచక శక్తులను మట్టు బెట్టే అర్జున్ సర్కార్ అనే కరకు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంనందున హింస, రక్తపాతం కాస్త ఎక్కువే ఉంటుంది.
కనుక ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2.37 గంటలు. ఈ సినిమాలో సబ్ టైటిల్‌తో సహా కొన్ని పదాలను మ్యూట్ చేయాలని, పోలీస్ యూనిఫారం కాలిపోతున్న దృశ్యం, శరీర భాగాలను కత్తిరించే సన్నివేశాల తీవ్రత తగ్గించాలని సూచిస్తూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ జారీ చేసింది.
హిట్-3లో రావు రమేష్, బ్రహ్మాజీ, అడవి శేష్, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాల, మాగంటి శ్రీనాధ్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: శైలేష్ కొలను, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేశారు.
వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నాని, ప్రశాంత్ తీపిర్నేని కలిసి నిర్మించిన హిట్-3 మే 1వ తేదీన విడుదల కాబోతోంది.