కుబేరా ఫస్ట్ సింగిల్ లోడింగ్..

April 13, 2025


img

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలలో జూన్ 20వ తేదీన వస్తున్న ‘కుబేర’ నాగార్జున కోటీశ్వరుడైన వ్యాపారవేత్తగా నటిస్తుండగా, ధనుష్ బిచ్చగాడిగా నటిస్తున్నారు. రష్మిక, జిమ్ సరబ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఇటువంటి కధతో శేఖర్ కమ్ముల ఏం చూపించబోతున్నారో అని కుబేరా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కుబేర సినిమా నుంచి త్వరలోనే మొదటి పాట విడుదల చేయబోతున్న చిత్ర బృందం ప్రకటించింది కానీ ఎప్పుడు విడుదల చేయబోతున్నారో తేదీ ప్రకటించలేదు. దానిలో ధనుష్ ఓ గుడి ఎదురుగా నిలబడి రెండు చేతులు పైకి ఎత్తి దణ్ణం పెడుతున్నట్లు చూపారు. 

ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు. 

శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష