త్వరలో సమంత పెళ్ళి?

October 11, 2024


img

ప్రముఖ నటి సమంత త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్, సిటాడేల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌ దర్శకులలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ఆమె ప్రేమలో పడిన్నట్లు చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఫ్యామిలీ మ్యాన్-2లో శ్రీలంక ఎల్‌టీటీఈ వేర్పాటువాద సంస్థ సభ్యురాలిగా సమంత నటించిన సంగతి తెలిసిందే.

కానీ అంతకు ముందే నాగ చైతన్యని విడిపోయారు. ఆమె చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. వీటన్నిటి కారణంగా సమంత తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేవారు. 

వెబ్ సిరీస్‌ షూటింగ్‌ సమయంలో దర్శకుడు రాజ్ నిడిమోరు ఆమెకు కొండంత అండగా నిలబడి చాలా ప్రోత్సహించడంతో ఆమె మళ్ళీ కోలుకోవడమే కాక ఫ్యామిలీ మ్యాన్-2, సిటాడేల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌ రెండు సూపర్ హిట్స్ కొట్టారు.  

తాము కలిసి తిరుగుతుండటం గురించి మీడియాలో వస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ త్వరలో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఈ మే నెలలోనే వారు పెళ్ళి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని వారు ఖండించలేదు. సమర్ధించలేదు. కనుక ఊహాగానాలు నిజమే అని భావించాల్సి ఉంటుంది. 


Related Post

సినిమా స‌మీక్ష