అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ... ముచ్చటగా బంధాలు..

October 11, 2024


img

విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లీ కొడుకులుగా నటించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' నుంచి ముచ్చటగా బంధాలే అంటూ సాగే రెండో పాట విడుదలైంది. రఘురామ్ వ్రాసిన ఈ పాటకి అజనీష్ లోక్‌నాధ్ సంగీతం అందించగా హరిచరణ్ ఆలపించారు. పాటలో తల్లీ-కొడుకు-కోడలు మద్య ప్రేమానుబంధాలను చక్కగా చూపారు. 

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కి జోడీగా సాయి మంజ్రేకర్ నటించగా శ్రీకాంత్, సొహైల్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. రన్ టైమ్ 2.24 నిమిషాలు. సినిమా క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించలేని ఓ ఆశ్చర్యకరమైన ముగింపు ఉందని తెలుస్తోంది.      

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి, సంగీతం అజనీష్ లోక్‌నాధ్, కెమెరా: రామ్ ప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.

ఎన్టీఆర్‌ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్ బులుసు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని ఈ నెల 18న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష