హమ్మయ్య.. విశ్వంభర మొదటి పాట వచ్చేస్తోంది

April 10, 2025


img

మల్లాది వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా చేస్తున్న ‘విశ్వంభర’ సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా, గేమ్ చేంజర్‌ కోసం వాయిదా వేసుకున్నారు. కానీ గేమ్ చేంజర్‌ ఫ్లాప్ అవడంతో విశ్వంభర సంక్రాంతి బిజినెస్ కోల్పోయింది. సంక్రాంతికి విడుదల కావలసిన విశ్వంభర మొదట మే 9కి వాయిదా పడింది. కానీ మళ్ళీ జూలై 24కి వాయిదా పడింది. అంటే దాదాపు 8 నెలలు ఆలస్యంగా వస్తోందన్న మాట! 

సినిమా వాయిదా పడటంతో మెగా అభిమానులు తీవ్ర అసహనంగా ఉన్నారు. కనుక ఈ శనివారం విశ్వంభర నుంచి ‘రామ రామ.. ' అంటూ సాగే తొలి పాటని విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ చిరంజీవి పోస్టర్ కూడా వేశారు. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటని ఎంఎం కీరవాణి స్వర పరిచారు.   

కళ్యాణ్ రామ్‌కి ‘బింబిసార’తో సూపర్ హిట్ ఇచ్చిన మల్లాది వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం, చిరంజీవి-శ్రీదేవి జంటగా చేసిన సూపర్ డూపర్ హిట్ సోషియో ఫాంటసీ వంటిది కావడంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలున్నాయి. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, సంగీతం: కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష