సినీ నిర్మాణ రంగంలోకి జగ్గారెడ్డి

March 27, 2025


img
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు జగ్గారెడ్డి తన పేరుతోనే ఓ సినిమా నిర్మించి దానిలో నటించబోతున్నారు. ‘జగ్గారెడ్డి, ఏ వార్ ఆఫ్ లవ్’ పేరుతో నిర్మించబోతున్న ఈ సినిమా కోసం ఆయన జయలక్ష్మీ ఫిలిమ్స్ అనే సినీ నిర్మాణ సంస్థని కూడా స్థాపించారు.
ఈ నెల 30న ఉగాది పండుగ రోజున హైదరాబాద్‌లో ఆయన సినీ నిర్మాణ సంస్థ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. దీని కోసం చురుకుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సిఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమానికి జగ్గారెడ్డి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది.

జయలక్ష్మీ ఫిలిమ్స్ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత లాంఛనంగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.

తన జీవితగాధకు దగ్గరగా ఉండే ఈ సినిమాలో తాను మాఫియాని ఎదిరించి ఓ యువ జంట పెళ్ళి చేసే ప్రధాన నాయకుడి పాత్రలో నటించబోతున్నానని జగ్గారెడ్డి చెప్పారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఉగాదికి విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు సంబందించి వివరాలు ఉగాది రోజున ప్రకటించే అవకాశం ఉంది. 

Related Post

సినిమా స‌మీక్ష