తండ్రీ కొడుకు అనుబందాలు, వైరుధ్యాలపై అనేకానేక సినిమాలు వచ్చాయి. కానీ ఎన్నటికీ పాతబడని ‘లవ్’ స్టోరీ వంటిదే తండ్రీ కొడుకు అనుబందాలు కూడా. ఇప్పుడు ఇదే కధతో ఎల్‌యూఎఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా వస్తోంది.
ప్రవీణ్ కేతరాజు కధ, దర్శకత్వంలో తీసిన ఈ సినిమాలో ఎస్పీ చరణ్, శ్రీహర్ష, కషిక కపూర్, రియా సింగ్, నవాబ్ షా, రఘుబాబు, షకలక శంకర్, శాంతి కుమార్, తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కెమెరా: శ్యామ్ కే నాయుడు, సంగీతం: మణి శర్మ, పాటలు: రెహ్మాన్, కాశర్ల శ్యామ్, ఉమా వంగూరి, కొరియోగ్రఫీ: మొబిన్, ఫైట్స్: యాక్షన్ కార్తీక్, ఎడిటింగ్: దేవరంపాటి రామకృష్ణ చేశారు. ,
ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం రాత్రి 8.04 గంటలకు, సినిమా ఏప్రిల్ 4న విడుదల కాబోతోంది.