ఉగాది రోజున చిరు-అనిల్‌ రావిపూడి సినిమా షురూ

March 26, 2025


img

మల్లాది వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్‌ పూర్తయిపోవడంతో, అనిల్‌ రావిపూడితో కొత్త సినిమా ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ నెల 30న ఉగాది పండుగ రోజున లాంఛనంగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించి షూటింగ్‌ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్‌కి సూపర్ హిట్ ఇచ్చిన అనిల్‌ రావిపూడి, ఈ సినిమా చిరంజీవి మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి ఈ సినిమా విడుదల చేయాలని అనిల్‌ రావిపూడి డెడ్ లైన్ పెట్టుకొని ప్రారంభించబోతున్నారు.  

విశ్వంభరలో త్రిష హీరోయిన్‌గా నటించగా, కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్, సురభి పురాణిక్, ఇషా చావ్లా, శుభలేఖ సుధాకర్‌, రావు రమేష్, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రలు చేశారు.    

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా,  కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న విశ్వంభర జూన్ నెలలో విడుదలకాబోతున్నట్లు తాజా సమాచారం. 


Related Post

సినిమా స‌మీక్ష