ది ప్యారడైజ్ ఓటీటీకి అంత వచ్చిందా!

March 16, 2025


img

నాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి నిర్మించిన ‘కోర్ట్’ సినిమా సూపర్ హిట్ అవడంతో కలెక్షన్స్‌ వర్షం కురుస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్-1,2 రెండు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి కనుక నాని చేస్తున్న హిట్-3 కూడా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే భావించవచ్చు. కనుక నాని ఖాతాలో మే1న ఈ హిట్ పడబోతోంది.

నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన దసరా సూపర్ హిట్ అయింది. కనుక మళ్ళీ వారిద్దరూ కలిసి చేస్తున్న ‘ది ప్యారడైజ్’ కూడా తప్పకుండా హిట్ అవుతుందనే అందరూ భావిస్తున్నారు. ఇటీవల ఆ సినిమాలో నాని పోస్టర్ విడుదల చేసిన తర్వాత అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

 దీంతో ఆ సినిమా కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. ఓ సంస్థ ఏకంగా రూ.60 కోట్లు చెల్లించి ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఆడియో సంస్థ రూ.15 కోట్లు చెల్లించి ఆడియో హక్కులు సొంతం చేసుకుంది. కనుక సినిమా విడుదలకు ముందే రూ.75 కోట్లు వెనక్కు వచ్చేశాయన్న మాట! 

ఇంత భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా 5 భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నారు కనుక ‘ది ప్యారడైజ్’ కలెక్షన్స్‌ మామూలుగా ఉండవు. 

‘ది ప్యారడైజ్’ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ‘దసరా’ నిర్మించిన నిర్మాత చెరుకూరి సుధాకరే ఈ సినిమా కూడా తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 26న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష