ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూడటం దేనికి?ఆ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం ఇస్తున్నారుగా?
ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. జూన్‌లోగా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని ఈ సినిమా నిర్మాత భూషణ్ కుమార్ చెప్పారు. స్పిరిట్ సినిమాలో నటించేందుకు ఆసక్తి, అనుభవం కలిగినవారు కావాలంటూ ఈ సినిమాని నిర్మిస్తున్న భద్రకాళి పిక్చర్స్, టీ ఫిలిమ్స్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన (క్యాస్టింగ్ కాల్) ఇచ్చాయి.
దీనికి ఎటువంటి వయో పరిమితి లేదు. కాస్త సినీ, నాటక రంగంలో అనుభవం ఉన్న స్త్రీ పురుషులు అవసరమని దానిలో పేర్కొన్నారు.
ఆసక్తి కలిగిన నటీనటులు రెండు ఫోటోలు, మీ చదువు, అర్హత, అనుభవం, చిరునామా వగైరా వివరాలు తెలియజేస్తూ రెండు నిమిషాలు నిడివి కలిగిన ఓ వీడియోని రికార్డ్ చేసి spirit.bhadrakalipictures@gmail.com కి పంపించాలని ఆ ప్రకటనలో కోరింది.
‘స్పిరిట్’ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ కామేశ్వర్ ఇప్పటికే రెండు పాటలు రికార్డ్ చేశారని, 2026 ఆగస్ట్-సెప్టెంబర్‌లోగా సినిమా విడుదల చేసేవిదంగా ప్లాన్ చేసుకుంటున్నామని నిర్మాత భూషణ్ కుమార్ చెప్పారు. మరెందుకు ఆలస్యం?వెంటనే ఫోటోలు, వీడియోలు పంపించేసి హైదరాబాద్ బయలుదేరేందుకు బ్యాగ్ సర్దేసుకోండి.