గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న కింగ్‌డమ్ సినిమా టీజర్ నిన్న సాయంత్రం విడుదలైన వెంటనే అభిమానులు లైక్ చేస్తూ మెసేజ్‌లు పెడుతున్నారు. ఆ అభిమానులలో విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన కూడా ఉంది.
టీజర్ విడుదలైన వెంటనే ఆమె కూడా చాలా బాగుందంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టింది. ఇతను ప్రతీసారి ఏదో ఓ అద్భుతం తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దామవుతుంటాడు,” అని రష్మిక మందన తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండని మెచ్చుకుంది.
రష్మిక మందన హీరోయిన్‌గా చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ కొన్ని వారాల క్రితం విడుదలైనప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇలాగే ఆమెను మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆమె మెచ్చుకుంటోంది.
గీతా గోవిందం సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో వారి ప్రేమ మరింత బలపడింది. ఆమె పండగలు, పబ్బాలకు విజయ్ దేవరకొండ ఇంటికి వెళుతుంటుంది. వారు కూడా ఆమెని కోడలిగానే భావిస్తున్నారు. కనుక ఇద్దరూ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారో మాత్రమే తెలియాల్సి ఉంది.
ఇద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండటం వలననే ఆలస్యం అవుతున్నట్లుంది. కానీ పెళ్ళి చేసుకోకుండా ఇలా లైకులు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తుంటే ఏదో రోజు ఎక్కడో తేడాకొడితే ‘అన్ ఫాలో’ చేసిందనే వార్త కూడా రావచ్చు. కనుక ఈ ఏడాదిలో ఇద్దరూ పెళ్ళి పీటలు ఎక్కుతారని అభిమానులు ఆశిస్తున్నారు.