గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 12వ సినిమాకి ‘కింగ్‌డమ్’ అనే టైటిల్ ఖరారు చేసి ఈరోజు ప్రకటించారు. జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో కింగ్‌డమ్ టీజర్ కూడా విడుదల చేశారు.
వలసలు వచ్చిన కొందరు ప్రజలపై ఆరాచకాలు, వాటితో వారి కష్టాలు, కన్నీళ్ళు, భావోద్వేగాలు... వారిని కాపాడే నాయకుడు.. మన హీరో... విలన్ గ్యాంగ్‌తో చేసే యుద్ధాలు ఈ సినిమా స్టోరీ అని టీజర్‌లో చూచాయగా చెప్పారు దర్శకుడు గౌతం తిన్ననూరి.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా భాగ్యశ్రీ భోరే నటిస్తోంది.
ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: గిరీష్ గంగాధరన్, జోమన్ టి జాన్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్: యానిక్ బెన్, చేతన్ డిసౌజా, రియల్ సతీష్ చేస్తున్నారు.
ఈ సినిమా మే 30న విడుదల చేయబోతున్నట్లు టీజర్‌లో ప్రకటించారు. కనుక రిలీజ్ డేట్ లాక్ చేసిన్నట్లే.