మా కొంప ముంచావుగా పృధ్వీ?

February 12, 2025


img

టాలీవుడ్‌లో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’గా పాపులర్ అయిన హాస్య నటుడు పృధ్వీ కొంత కాలం వైసీపీ ద్వారా ఏపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. ఆ కారణంగానే జగన్‌ ఆయనకి టీటీడీ ఆధ్వర్యంలో పనిచేసే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ బాధ్యతలు అప్పగించారు. కానీ నోటి దురద కారణంగా పదవి పోగొట్టున్నారు. ఆ తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీలో చేరారు. 

కానీ ఆయన నోటి దురద నేటికీ అలాగే ఉంది. లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, “మొదట్లో 150 గొర్రెలు ఉండేవి ఇప్పుడు 11 మాత్రమే మిగిలాయి,” అంటూ వ్యంగ్యంగా అన్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించే అన్నారని అర్దమవుతూనే ఉంది. 

కనుక అప్పటి నుంచి ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో #బాయ్‌కాట్ లైలా అంటూ ప్రచారం ప్రారంభించారు. మరో రెండు రోజులలో లైలా విడుదలవుతుండగా ఈ సమయంలో ఈవిదంగా జరగడంతో ఈ చిత్ర నిర్మాత సాహు గారపాటి సోషల్ మీడియా ద్వారా జగన్‌ మద్దతుదారులకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత విశ్వక్‌ సేన్‌ కూడా చెప్పారు. 

అయినా#బాయ్‌కాట్ లైలా ప్రచారం సాగుతూనే ఉంది. లైలా సినిమా అడల్ట్ కంటెంట్, దానిలో విశ్వక్‌ సేన్‌ లైలా పాత్రని విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 

దీంతో విశ్వక్‌ సేన్‌ మళ్ళీ స్పందిస్తూ, “నాకు, నా సినిమాకు ఏ రాజకీయాలతో సంబందం లేదు. కనుక మీ రాజకీయాలలో మా సినిమాని రిలీజ్‌ కాక ముందే చంపేయకండి. పృధ్వీ అనుభవం అంత నా వయసు లేదు. ఆయన వేదికపైకి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతారో మాకెలా తెలుస్తుంది?

ఆయన మాట్లాడే సమయంలో చిరంజీవిగారు వస్తే ఆయనని రిసీవ్ చేసుకోవడానికి మేమందరం బయటకు వెళ్ళాము. కనుక ఆయన ఏం మాట్లాడారో మాకు తెలీదు కూడా. 

అయినా ఇంతమందిలో ఎవరో ఏదో మాట్లాడితే ప్రతీ దానికీ సినిమా బాయ్‌కాట్ చేస్తామంటే ఎలా?నిర్మాత సాహుగారు 30 కోట్లు పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడి పనిచేశాము. దేనికి? ప్రేక్షకులను అలరించడానికే కదా?

మరో రెండు రోజులలో లైలా రిలీజ్‌ అవుతోంది. కనుక ఇకనైనా ఈ ట్రోలింగ్ ఆపేసి సినిమాని అందరూ ఎంజాయ్ చేయమని అభ్యర్ధిస్తున్నాను,” అని విశ్వక్‌ సేన్‌ అన్నారు.  

పృధ్వీ నోటి దురద వలన ఆయన ఎలాగూ ఎదురుదెబ్బలు తిన్నారు. ఆయనకి ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ఈవిదంగా మాట్లాడి ‘లైలా’కి కూడా ఇటువంటి సమస్యలు సృష్టించిపెట్టి, ఈ ట్రోలింగ్ భరించలేక ఆరోగ్యం బాగోలేదంటూ హాస్పిటల్లో చేరి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన నోటి దురదకు లైలా బలైపోతే ఇక సినీ పరిశ్రమలో ఆయనకు ఎవరూ అవకాశం ఇవ్వరు. 


Related Post

సినిమా స‌మీక్ష