ఎన్టీఆర్‌-నీల్‌ సినిమా అప్‌డేట్‌

February 09, 2025


img

జూ.ఎన్టీఆర్‌ దేవర సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దేవర నుంచి జూ.ఎన్టీఆర్‌ బయటకు వచ్చి చాలా రోజులే అయ్యింది. అది పూర్తికాగానే బాలీవుడ్‌లో హృతిక రోషన్‌తో కలిసి వార్-2 సినిమా చేశారు. కనుక ఇప్పుడు ఎన్టీఆర్‌-నీల్‌ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారికి ఓ శుభవార్త!

ఇటీవలే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తవడంతో ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్ నెలలో జూ.ఎన్టీఆర్‌ షూటింగ్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. 

ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా కన్నడ భామ రుక్మిణీ వసంత్ నటించబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కించబోతున్నాయి. ఈ సినిమాని 2026 జనవరిలో విడుదల చేస్తామని ప్రశాంత్ నీల్‌ చెప్పారు. కనుక ఈ పది నెలల్లో సినిమాని పూర్తిచేసేందుకు ప్రశాంత్ నీల్‌ అంతా ప్లాన్ చేసుకుని  షూటింగ్‌ మొదలుపెట్టబోతున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష