బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అఖండ’ సూపర్ డూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే వారు ప్రకటించారు. ఈ సంక్రాంతికి బాలయ్య డాకూ మహరాజ్ సినిమాతో హిట్ కొట్టారు.
కనుక ఇప్పుడు వారిరువురి కాంబినేషన్‌లో అఖండ-2 తాండవం మొదలుపెట్టేసి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఇటీవల కుంభమేళాకు వెళ్ళి అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి వచ్చారు.
ఈ నెలాఖరు నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. అఖండ-2లో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం సంయుక్త మీనన్ పేరు ఖరారు చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాని బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తున్నారు. కోటి పరుచూరి సహ నిర్మాత.