పుష్ప-1, 2 సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. పుష్ప-3 తప్పక ఉంటుందని సుకుమార్, అల్లు అర్జున్ ఎప్పుడో చెప్పేశారు కానీ ఎప్పుడు మొదలుపెడతారో మాత్రం తెలీదు.
ఈ రెండు సినిమాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా, “పుష్ప-1,2లో ఐటెమ్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. వాటికి డాన్స్ చేసిన సమంత, శ్రీలీల ఇద్దరూ మంచి పేరు సంపారించుకున్నారు.
అంతకు ముందు కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఇద్దరూ తమ కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఐటెమ్ సాంగ్స్ చేసి మరింత పాపులర్ అయ్యారు. సాయి పల్లవి, జాన్వీ కపూర్ ఇద్దరూ అద్భుతమైన డాన్సర్స్. వారిలో జాన్వీ కపూర్ అయితే పుష్ప-3లో ఐటెమ్ సాంగ్‌కి బాగుంటారని నేను భావిస్తున్నాను.
ఎందుకంటే ఆమె డాన్స్ మూమెంట్స్ లో తల్లి శ్రీదేవికి ఉండే గ్రెస్‌నెస్ నాకు కనబడుతుంది. ఇలాంటి పాటలకు డాన్సులో అది చాలా ముఖ్యం. నా అభిప్రాయం దర్శక, నిర్మాతలకు చెపుతుంటాను. వారికి నచ్చితే ఆమెను తప్పకూడా తీసుకుంటారు,” అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.