పుష్ప-2 హాఫ్ సెంచరీ.. ఇక ఓటీటీలోకే

January 24, 2025


img

గత నెల 5న పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. నేటితో థియేటర్లలో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ 50 రోజులలో భారత్‌లో రూ.1230.55 కోట్లు నెట్‌, ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లు కలెక్షన్స్‌ సాధించి అన్ని రికార్డులు బద్దలు కొట్టింది.

సినిమా విడుదలైన తర్వాత 56 రోజుల వరకు ఏ ఓటీటీలో విడుదల చేయబోమని మైత్రీ మూవీ మేకర్స్ ముందే ప్రకటించింది. నేటితో 50 రోజలయ్యింది.

ఒకవేళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓటీటీలో విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తే జనవరి 26 నుంచి పుష్ప-2 నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ప్రసారం అయ్యే అవకాశం ఉంది.

కానీ ముందు అనుకున్నట్లు 56 రోజులు గడువుకే కట్టుబడి ఉండాలనుకుంటే ఈ నెలాఖరు నుంచి పుష్ప-2 ఓటీటీలోకి వచ్చేయడం ఖాయం. సమయం దగ్గర పడింది కనుక నేడో రేపో నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించవచ్చు.


Related Post

సినిమా స‌మీక్ష