జనవరి 26న రవితేజ మాస్ జాతరట!

January 24, 2025


img

మాస్ మహారాజ రవితేజ 75వ సినిమా పేరు కూడా ‘మాస్ జాతర’ అని పెట్టుకున్నారు. రచయిత బొగ్గవరపు భాను ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాస్ జాతర టీజర్‌ ఉంటుందని తెలియజేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సోషల్ మీడియాలో ప్రకటించింది. 

వడ్డించేందుకు సిద్దంగా ఉన్న గిన్నెల ఎదురుగా మీసం తిప్పుతూ కూర్చున్న రవితేజ, పక్కనే ఆయన చేతిలో తన్నులు తిని పడున్న కొందరితో  ఫోటో చాలా ఆసక్తికరంగా ఉంది. 

తెలంగాణ నేపధ్యంలో సాగే కధాంశంతో తీస్తున్న ఈ సినిమాలో రవితేజ లక్ష్మణ్ భేరీ. న్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 80 శాతం పూర్తయింది. రవితేజ గాయపడటంతో సినిమా షూటింగ్‌ కొన్ని రోజులు వాయిదా పడింది. మళ్ళీ ఈ నెల 17 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నారు.   

ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.  

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర సిద్దం చేస్తున్నారు. సినిమా రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. బహుశః శివరాత్రి లేదా ఉగాదికి ముందు విడుదల చేస్తారేమో?


Related Post

సినిమా స‌మీక్ష