మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో ప్రియాంకా చోప్రా ఫైనల్!

January 23, 2025


img

మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా నటించడం ఖరారు అయ్యింది. ఇటీవలే ఆమె తిరుమల శ్రీవారిని, హైదరాబాద్‌లో చిలుకూరు బాలాజీని దర్శించుకుని ఓ పెద్ద ప్రాజెక్టులో ప్రవేశించబోతున్నాను అందరి ఆశీర్వాదాలు కావాలి అని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు.

ఆమెకు స్క్రీన్ టెస్టింగ్ కూడా పూర్తయిపోయింది. అయితే హాలీవుడ్ సినిమాలలో కూడా నటించే ప్రియాంకా చోప్రా రాజమౌళి సినిమాకు రెండు మూడేళ్ళు పూర్తిగా అంకితం కాగలరా? రాజమౌళి సినిమాలో నటించడానికి ఒప్పుకుంటే అది పూర్తయ్యే వరకు బయట ప్రపంచానికి దూరంగా ఉండాలి. బాలీవుడ్‌లో నిత్యం చాలా బిజీగా ఉండే ప్రియాంకా చోప్రా బయట తిరగకుండా సమాయమనం పాటించగలరా? లేకపోతే  పరిస్థితి ఏమిటి?వంటి ప్రశ్నలకు షూటింగ్‌ మొదలైన తర్వాత ఆమె దానిలో జేరిన తర్వాత మెలమెల్లగా తెలుస్తుంది. 

ఎప్పటిలాగే ఈ సినిమాలో కీరవాణి సంగీతంతో సహా రాజమౌళి కుటుంబ సభ్యులు అన్ని పనులు చక్కబెట్టేస్తారు కనుక అదే టీమ్‌ ఉంటుంది. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్నందున ఆ స్థాయిలోనే కొందరు నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారు. 

సినీ పరిశ్రమకి సెంటిమెంటుగా మారిన హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఓ సెట్ వేశారు. తొలి షెడ్యూల్‌ అక్కడే ఈ నెలాఖరు నుంచి ప్రారంభించబోతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష