నాగ్ చైతన్యకి విలన్ శ్రీవాత్సవ?

January 22, 2025


img

నాగ చైతన్య, సాయి పల్లవి ‘తండేల్‌’ సినిమా పూర్తి చేసిన తర్వాత కార్తీక్ దండు దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు స్పర్శ్ శ్రీవాత్సవని ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. హిందీ వెబ్ సిరీస్ జంతారతో మంచి పేరు సంపాదించుకున్న అతను గత ఏదాడి విడుదలైన ‘లాఫతా లేడీస్’తో మంచి నటుడుగా మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు. కనుక అతనిని ఈ సినిమాతో టాలీవుడ్‌లో విలన్‌గా పరిచయం చేయాలని దర్శకుడు కార్తీక్ దండు భావిస్తున్నట్లు తెలుస్తోంది.                 

ఇది సోషియో ఫాంటసీ చిత్రమని ప్రీ-లుక్ పోస్టర్లో చిన్న హింట్ ఇచ్చారు కానీ అవునా కాదా అనేది త్వరలో సినిమా మొదలుపెడితే తెలుస్తుంది. 

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చేసిన ఇక తండేల్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో వారిరువురూ చేపలు పట్టే జాలారీ కుటుంబానికి చెందినవారుగా నటిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష