కన్నప్పలో ప్రభాస్‌ అంతవరకేనట!

January 22, 2025


img

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో ప్రభాస్‌ నందీశ్వరుడుగా అతిధి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కన్నప్పలో ప్రభాస్‌ అతిధి పాత్రలో నటించడానికి ఒప్పుకోవడమే మంచు విష్ణుకి పెద్ద వరంగా చెప్పొచ్చు. ఆయనని చూసేందుకైనా అభిమానులు కన్నప్పని చూస్తారని మంచు విష్ణు ఆశించడం తప్పు కాదు.

కనుక కన్నప్పకి ప్రభాస్‌ ఓ ప్లస్ పాయింట్ అనే అనుకోవచ్చు. అయితే గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మంచు విష్ణు కన్నప్పతో హిట్ కొట్టి మళ్ళీ తన కెరీర్‌ని, ఇటీవల కుటుంబంలో జరిగిన గొడవలతో మసకబారిన తన పేరు ప్రతిష్టలను మళ్ళీ చక్కదిద్దుకోవాలని ఆశపడుతున్నారు. 

కనుక ప్రభాస్‌ని కన్నప్ప సినిమా ప్రమోషన్స్‌ రప్పించగలిగితే ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశపడుతున్నారు. కానీ ప్రభాస్‌ ప్రస్తుతం మారుతితో రాజాసాబ్ సినిమా షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. అది పూర్తయిపోగానే  ఫౌజీ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టబోతున్నారు.

కనుక కన్నప్ప ప్రమోషన్స్‌కి సమయం కేటాయించకపోవచ్చని సమాచారం. కనుక ప్రమోషన్స్‌ రాలేకపోయినా కనీసం ఓ ఇంటర్వ్యూ కైనా ఒప్పించాలని మంచు విష్ణు ప్రయత్నిస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.     



Related Post

సినిమా స‌మీక్ష