డాకూ మహరాజ్ మేకింగ్ వీడియో కూడా దించేశారు

January 11, 2025


img

సంక్రాంతి బరిలో ముందుగా గేమ్ చేంజర్‌ దిగగా, రేపు (ఆదివారం) డాకూ మహరాజ్ దిగబోతున్నాడు. ఇప్పటికే ఓ ట్రైలర్‌ విడుదల చేసినప్పటికీ శుక్రవారం రిలీజ్ ట్రైలర్‌ అంటూ మరో ట్రైలర్‌ విడుదల చేశారు.

సినిమా విడుదలయ్యే వరకు మా హడావుడి ఉంటుందని బాలకృష్ణ ముందే చెప్పారు కనుక మరికొన్ని గంటలలో సినిమా విడుదల కాబోతుండగా ప్రమోషన్స్‌లో భాగంగా డాకూ మహరాజ్ మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు. 

సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ సినిమాలన్నీ హిట్ అవుతుంటాయి కనుక డాకూ మహరాజ్‌ని కూడా సంక్రాంతికే దింపుతున్నారు.

బాలకృష్ణ ప్రతీ సినిమాలో పంచ్ డైలాగులు, యాక్షన్ సీన్స్‌తో బాటు కొత్తగా సెంటిమెంట్ కూడా జోడిస్తున్నారు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన భగవంత్ కేసరి, రేపు విడుదల కాబోతున్న డాకూ మహరాజ్‌లో కూడా సెంటిమెంట్ ఉంది. కనుక ఈ సినిమా తప్పక హిట్ అవుతుందనే అందరూ పూర్తి నమ్మకంతో ఉన్నారు. 

డాకూ మహరాజ్‌లో శ్రద్ద శ్రీనాధ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా చేయగా, బాబీ డియోల్, సచిన్ ఖేడెకర్, హిమజ, హర్ష వర్ధన్, చాందినీ చౌదరీ, రీషమా నానయ్య ముఖ్యపాత్రలు చేశారు. ఊర్వశీ రౌతేలా ‘దిబిడీ దిబిడీ’ అంటూ స్పెషల్ సాంగ్‌ చేశారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బాబీ కొల్లి, స్క్రీన్ ప్లే: కె.చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు: సంగీతం: తమన్, కెమెరా: విజయ్‌ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే, స్టంట్స్‌: వి వెంకట్ చేశారు.   

ఈ సినిమాను శ్రీకార స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. 

 


Related Post

సినిమా స‌మీక్ష