నేను చంపడంలో మాస్టర్స్ చేశా: డాకూ మహరాజ్

January 10, 2025


img

డాకూ మహరాజ్ ట్రైలర్‌ ఇదివరకే విడుదలైంది. ఆదివారం సినిమా రిలీజ్ కాబోతోంది కనుక రిలీజ్ ట్రైలర్‌ అంటూ మరో ట్రైలర్‌ విడుదల చేశారు. ఇది కూడా బాలయ్య మార్క్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌తోనే అభిమానులు ఒళ్ళు పులకరించేలా ఉంది.

“అందరూ చదువులలో మాస్టర్స్ చేస్తారు కానీ నేను చంపడంలో మాస్టర్స్ చేశాను. ఐ డూ మాస్టర్స్ ఇన్ మర్డర్స్,’ అంటూ బాలయ్య డైలాగులకు అభిమానులు సంతోషించవచ్చేమో కానీ ఆయన రాజకీయాలలో కూడా ఉన్నారు కనుక ప్రతిపక్ష వైసీపీ ఈ డైలాగ్ ఎప్పుడో అప్పుడు ఆయనపైనే పేల్చకుండా ఉండదు.      

డాకూ మహరాజ్ సినిమాలో ఓ చిన్నారిని కూడా చూపుతూ ఓ పాట కూడా రిలీజ్ చేశారు. కనుక రిలీజ్ ట్రైలర్‌లో ‘ఫ్యామిలీ మ్యాన్’ బాలయ్యని కూడా చూపారు.      

బాలకృష్ణ-బాబీ కొల్లి కాంబినేషన్‌లో జనవరి 12న వస్తున్న ‘డాకూ మహరాజ్’లో శ్రద్ద శ్రీనాధ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా చేశారు. బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ఈ సినిమాలో సచిన్ ఖేడెకర్, హిమజ, హర్ష వర్ధన్, చాందినీ చౌదరీ, రీషమా నానయ్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్‌ చేశారు.    

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బాబీ కొల్లి, స్క్రీన్ ప్లే: కె.చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు: సంగీతం: తమన్, కెమెరా: విజయ్‌ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే, స్టంట్స్‌: వి వెంకట్ చేశారు.    

శ్రీకార స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. జనవరి 12న సంక్రాంతి పండుగకు ముందు డాకూ మహారాజ్ విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష