సిఎం రేవంత్ రెడ్డి ఇకపై ఏ సినిమాకి టికెట్స్ ధరలు పెంచుకోవడానికి, ప్రివిలేజ్ షోలు, బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతించబోనని శాసనసభలో తెగేసి చెప్పారు. సినీ ప్రముఖులతో జరిగిన సమావేశంలో మళ్ళీ అదే చెప్పారు. కానీ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు అభ్యర్ధించగానే తన నిర్ణయం మార్చుకొని సినిమాకి టికెట్స్ ధరలు పెంచుకోవడానికి, అదనపు షోలు వేసుకోవడానికి అనుమతించారు.
దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. హైకోర్టు చొరవ తీసుకొని గేమ్ చేంజర్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించింది. ముఖ్యంగా తెల్లవారుజామున సినిమా ప్రదర్శనని అనుమతించడం సరికాదని కనుక ప్రభుత్వ నిర్ణయాన్ని పునః పరిశీలించుకొని తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. భారీ భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసినంత మాత్రాన్న ఆ భారాన్ని ప్రేక్షకులపై వేయడం సరికాదని అభిప్రాయపడింది. సంధ్య థియేటర్ ఘటన నేపధ్యంలో ప్రేక్షకుల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడటం మంచిది కాదని హైకోర్టు సూచించిన్నట్లు తెలుస్తోంది.