సంధ్య థియేటర్ ఘటన వలన అల్లు అర్జున్ ఎన్ని విమర్శలు, సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ పుష్ప-2 సూపర్ డూపర్ హిట్ అయినందున ఆయనతో ఒక్క సినిమా చేయడం కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కూడా ఉన్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అవి నిజమో కాదో తెలీదు కానీ అల్లు అర్జున్ నిన్న ముంబయి విమానాశ్రయంలో కనబడ్డారు. అల్లు అర్జున్ వేరే హిందీ సినిమాలలో నటించడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కొత్త సినిమా ఇంకా మొదలుపెట్టలేదు.
కనుక అల్లు అర్జున్ సంజయ్ లీలా బన్సాలీతో సినిమా కధ గురించి చర్చించడానికే ముంబయికి వెళ్ళారని సోషల్ మీడియా చెపుతోంది. ఇది నిజమో కాదో తెలీదు కానీ ఒకవేళ నిజమైతే బాలీవుడ్‌లో అల్లు అర్జున్ హవా మొదలైపోయిన్నట్లే!
అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాలంటే రెండు ముఖ్య విషయాలున్నాయి. 1 పుష్ప-2 రీలోడడ్, 2. సంధ్య థియేటర్ కేసు.
పుష్ప-2 కలెక్షన్స్ రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. కనుక మళ్ళీ వాటి గురించి చెప్పుకోనవసరం లేదు. పుష్ప-2ని బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు ప్రేక్షకులకు పుష్పరాజ్ ఓ కానుక ఇవ్వబోతున్నాడు.
ఈ సినిమా నిడివి బాగా ఎక్కువగా ఉందనే కారణంతో సుమారు 20 నిమిషాల నిడివి గల వీడియోని ఎడిటింగ్‌లో తొలగించారు. ఇప్పుడు ఆ వీడియోని పుష్ప-2 రీలోడడ్ పేరుతో సినిమాకి జోడించబోతున్నారు. ప్రేక్షకులు దీనిని జనవరి 17 నుంచి చూసి ఆనందించవచ్చని ట్వీట్ చేశారు.
సంధ్య థియేటర్ ఘటన కేసులో రెండు నెలలపాటు ప్రతీ ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి సంతకం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓ ఆదివారం సంతకం చేశారు. ఎల్లుండి మళ్ళీ వెళ్ళక తప్పదు. ఒకవేళ అల్లు అర్జున్ సినిమా షూటింగు మొదలైతే ఇదో అవరోధంగా మారుతుంది.
Allu Arjun at Mumbai Airport : pic.twitter.com/qoYIhc1GGA
— Telugu360 (@Telugu360) January 10, 2025