గాంధీ తాత చెట్టు కింద సుకుమార్ కుమార్తె

January 09, 2025


img

దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి బాల నటిగా తొలిసారిగా నటించిన ‘గాంధీ తాత చెట్టు’ అనే సినిమా ఈ నెల 22 న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. 

చెట్లను కాపాడుకోవాలనే ఓ చక్కటి సామాజిక సందేశంతో తీసిన సినిమా అని ట్రైలర్‌ చూస్తే అర్దమవుతుంది. గాంధీజీ సిద్దాంతాలను మనస్పూర్తిగా నమ్మి ఆచరించే విద్యార్ధినిగా సుకృతి నటించింది. ఈ కాలంలో గాంధీజీ సిద్దాంతాలు పాటించడం ఎంత కష్టమో, ఎంత విచిత్రంగా ఉంటాయో ట్రైలర్‌లో చక్కగా చూపారు. సుకృతి తొలి సినిమాయే అయినప్పటికీ చాలా సహజంగా నటించింది. 

 ఈ సినిమాలో సుకృతి వేణి బండ్రెడ్డి, ఆనంద చక్రపాణి, రాగ మయూర్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రఘురాం తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: పద్మావతి మల్లాది, పాటలు: సుద్దాల అశోక్ తేజ, సంగీతం: రీ, కెమెరా: విశ్వ దేవాబత్తుల, శ్రీజిత చెరువుపల్లి, ఎడిటింగ్: హరిశంకర్, ఆర్ట్: వి నాని పండు చేశారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ బ్యానర్లపైనవీన్ ఎర్నేని, రవి శంకర్, శేష సింధు రావు నిర్మించారు.

 


Related Post

సినిమా స‌మీక్ష