రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో గేమ్ చేంజర్ రేపు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈరోజు అర్దరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో వేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. కనుక మరికొన్ని గంటలలోనే గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో గేమ్ చేంజర్ నుంచి అన్ ప్రెడిక్టబుల్ అంటూ సాగే పాటని విడుదల చేశారు.
అద్వితీయ, బ్లేజ్ వ్రాసిన ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ విడుదల చేశారు. జపనీస్ వెర్షన్లో కూడా ఈ పాట రిలీజ్ చేశారు. మరో విశేషమేమిటంటే జపనీస్ వెర్షన్ లిరిక్స్ అద్వితీయ వ్రాయగా, ఈ పాటని స్వరపరిచిన సంగీత దర్శకుడు తమన్, బ్లేజ్‌తో కలిసి ఈ పాట పాడారు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా కియరా అద్వానీ నటించగా, మరో పాత్రకి జోడీగా అంజలి నటించారు. ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేశారు.
శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ కలిసి నిర్మించిన గేమ్ చేంజర్ 5 భాషలతో పాటు జపాన్‌లో కూడా జపనీస్ భాషలో శుక్రవారమే విడుదల కాబోతోంది.