డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప-2 నేటికీ కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డులు సాధిస్తూ దూసుకుపోతూనే ఉంది. సినిమా విడుదలై నెలరోజులు దాటిన తర్వాత చివరిగా మరోసారి కలెక్షన్స్ పెంచుకునేందుకుగాను సినిమాలో తీసి పక్కన పెట్టేసిన మరికొన్ని సన్నివేశాలు జోడిస్తుంటారు. వాటిని చూసేందుకు మళ్ళీ ప్రేక్షకులు వస్తారు కనుక కలెక్షన్స్ పెరుగుతాయి.
పుష్ప-2లో కూడా మరో 20 నిమిషాలు నిడివి గల సన్నివేశాలు ‘పుష్ప-2 రీ లోడెడ్’ పేరుతో కలుపబోతున్నామని చిత్ర బృందం ఇదివరకు ప్రకటించింది. కానీ సాంకేతిక కారణాల వలన వాయిదా వేశమని చిత్ర బృందం సోషల్ మీడియాలో తెలియజేసింది.
ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న పుష్ప-2 రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు. దానికి మరో 20 నిమిషాల వీడియో జోడిస్తే 3.40 గంటలు అవుతుంది. మద్యలో 20 నిమిషాల ఇంటర్వెల్ కూడా కలుపుకుంటే మొత్తం 4 గంటల సేపు ప్రేక్షకులు థియేటర్లలో ఉంటారు. అయినప్పటికీ దర్శకుడు సుకుమార్ ప్రేక్షకులను కుర్చీలలో నుంచి కదలకుండా కూర్చోబెట్టగలిగారు.
పుష్ప-2 విడుదలైనప్పటి నుంచి ఈ 32 రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) కలెక్షన్స్ సాధించి ఇంకా దూసుకుపోతోంది. జనవరి నెలాఖరు వరకు థియేటర్లలో ఉంటుంది కనుక మరో రూ.200 కోట్లు అవలీలగా సాధించే అవకాశం ఉంది.