మెగాస్టార్ చిరంజీవి కుమార్తె నిహారిక కొణిదెల హీరోయిన్‌గా చేసిన ‘మద్రాస్ కారన్’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
“సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిందని తెలిసి నేను, మా కుటుంబ సభ్యులు అందరం కూడా చాలా బాధ పడ్డాము. అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి తేరుకుంటున్నారు,” అని చెప్పారు.
అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ, “ఆయన తన స్టయిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతీ సినిమాకి పూర్తి భిన్నమైన స్టయిల్లో కనపడాలని కోరుకుంటారు. అలాగే కనపడుతుంటారు కూడా. కనుక సినిమాలో నటించేవారు ఆయన నుంచి ఈవిషయం తప్పక నేర్చుకోవాలి. నేను కూడా అల్లు అర్జున్ నుంచి ఇది నేర్చుకొని ఫాలో అవుతుంటాను,” అని నీహారిక చెప్పారు.
రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, “నలుగురిలో ఉన్నప్పుడు, ముఖ్యంగా మీడియాతో ఉన్నప్పుడు బ్యాలన్స్ డ్‌గా ఏవిదంగా మాట్లాడాలో నేను ఆయన నుంచే నేర్చుకున్నాను. రామ్ చరణ్ ప్రెస్‌మీట్‌లు, ప్రసంగాలు వింటే ఈ విషయం అందరికీ అర్దమవుతుంది. ఇక నా సినిమాల కధల విషయంలో నేను వరుణ్ తేజ్‌తో మాట్లాడి ఆయన సలహాలు తీసుకుంటాను,” అని నీహారిక చెప్పారు.