అడవి శేష్ నటించిన గూఢఛారి సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా గూఢఛారి-2 తీస్తున్నారు. వినయ్ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో వామికా గబ్బీని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయం తెలియజేస్తూ, “వెల్ కమ్ టు ది మిషన్. మై పార్ట్ నర్ ఇన్ అడ్వెంచర్,” అంటూ పారిస్‌లో ఈఫిల్ టవర్ ముందు నిలబడిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు షాలిని తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.