చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా చేస్తున్న ‘తండేల్’ సినిమా పూర్తయిపోయింది కనుక నాగ చైతన్య త్వరలో తన 24 వ సినిమా కార్తీక్ దండు దర్శకత్వంలో మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలో మొదట మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ ఇప్పుడు శ్రీలీల పేరు దాదాపు ఖాయం చేసిన్నట్లు తెలుస్తోంది. నేడో రేపో ఈవిషయం అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ సినిమా ప్రకటిస్తూ విడుదల చేసిన ప్రీ-లుక్ పోస్టర్లో ఓ జంతువు కంట్లో ప్రతిబింబంగా కొండల మద్య నిలుచున్న నాగ చైతన్యని చూపారు. కనుక ఇది సోషియో ఫాంటసీ చిత్రం అయ్యుండవచ్చు.
ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది. సంక్రాంతి పండుగ తర్వాత నాగ చైతన్య వచ్చి చేరుతారు. సినిమా షూటింగ్ మొదలవబోతోంది కనుక దీనిలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.