విశ్వక్‌ సేన్‌ మరోటి మొదలుపెట్టేశాడే!

December 11, 2024


img

విశ్వక్‌ సేన్‌ మెకానిక్ రాఖీ చేస్తుండగానే లైలా సినిమాని లైన్లో పెట్టాడు. అది చేస్తుండగానే ఇప్పుడు మరో సినిమాని లైన్లో పెట్టేశాడు. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో చేయబోతున్న ఈ సినిమాకి ‘ఫంకీ’ అని పేరు ఖరారు చేసి ఇవాళ్ళ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు కూడా చేశారు. 

జాతి రత్నాలు వంటి గొప్ప కామెడీ సినిమాతో ప్రేక్షకులను అలరించిన అనుదీప్ ఈ సినిమా కూడా ‘ఫన్-ఫ్యామిలీ-ఎంటర్టెయినర్’ అని పోస్టర్లోనే చెప్పేశారు. ఈ సినిమాలో ఆషికా రంగనాద్ విశ్వక్‌ సేన్‌కు జోడీగా నటించబోతోంది. 

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ సినిమా నిర్మించబోతున్నారు. 

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ మొదలవుతుంది. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనుదీప్, సంగీతం: భీమ్స్  సీసీరిలియో, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష