కేతికా శర్మ ఐటెమ్ సాంగ్.. అప్పుడే కాదు

December 11, 2024


img

నితిన్, శ్రీలీల జంటగా ‘రాబిన్‌హుడ్’ ఈ నెల 25న క్రిస్మస్ పండుగ రోజున విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘అదిదా సర్‌ప్రీజు...’ అంటూ సాగే ఐటెమ్ సాంగ్కి కేతికా శర్మ డాన్స్ చేసింది. ఆ పాట 10 వ తేదీన విడుదల కావలసి ఉండగా సాంకేతిక సమస్యల వలన విడుదల చేయలేకపోయామని, అంతవరకు ‘రాబిన్ హుడ్’లో మొదటి పాటమో ఎంజాయ్ చేయమని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్ చేసింది. 

వెంకీ కుడుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ‘రాబిన్ హుడ్‌’ని పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో నిర్మించారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేశారు. 



Related Post

సినిమా స‌మీక్ష