హరిహర వీరమల్లు షూటింగ్‌ దాదాపు పూర్తి

December 11, 2024


img

పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో ‘హరిహర వీరమల్లు’ గురించి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్‌ వంటి గొప్ప వ్యక్తితో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. 

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. మరో రెండు మూడు రోజులు షూటింగ్‌ మిగిలుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఓ పాట విడుదల కాబోతోంది. సినిమా షూటింగ్‌ పూర్తయిపోతోంది గనుక ముందే ప్రకటించిన విదంగా మార్చి 28న సినిమా విడుదలవుతుంది,” అని చెప్పారు. 

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ క్షణం తీరికలేని జీవితం గడుపుతున్నప్పటికీ దర్శక నిర్మాతల అభ్యర్ధన మేరకు వీలుచేసుకొని విజయవాడలో వేసిన సెట్స్‌లో హరిహర వీరమల్లు షూటింగ్‌లో పాల్గొంటూ సినిమాని పూర్తి చేస్తున్నారు. 

క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలు పెట్టినప్పటికీ షూటింగ్‌ ఆలస్యం అవుతుండటంతో క్రిష్ స్థానంలో జ్యోతి కృష్ణ మిగిలిన సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా  నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్ చేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష