రష్మిక ముద్రతో గర్ల్ ఫ్రెండ్ టీజర్‌

December 10, 2024


img

రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా చేస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్‌ వచ్చేసింది. టీజర్‌ చూస్తుంటే ఆమె తన ప్రియుడు విజయ్ దేవరకొండతో కలిసి చేసిన సూపర్ హిట్ సినిమా ‘గీతా గోవిందం’ కళ్ళ ముందు కదులుతుంది. ఇటువంటి ప్రేమ కధలు చేయడంలో ఆమెకు ఆమే సాటి. కనుక టీజర్‌లో రష్మిక మందన ముద్ర చాలా స్పష్టంగా కనబడుతుంది. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్, ఎడిటింగ్: చోట కే ప్రసాద్ చేస్తున్నారు. 

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.    


Related Post

సినిమా స‌మీక్ష