రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్ పూర్తవడంతో బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్‌సీ17 వర్కింగ్ టైటిల్‌తో తన 17వ సినిమా మొదలుపెట్టి, ఇటీవలే మొదటి షెడ్యూల్ మైసూర్‌లో పూర్తి చేశారు కూడా. సోమవారం నుంచి హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ మొదలవబోతోంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్‌తో సహా ముఖ్య పాత్రలు చేస్తున్నవారు పాల్గొనబోతున్నారు.
రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనవలసి ఉంది కనుక రెండో షెడ్యూల్ వారం రోజులు మాత్రమే ఉండబోతోంది. రామ్ చరణ్ తిరిగి వచ్చేలోగా మూడో షెడ్యూల్ షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకుని సిద్దంగా ఉండాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ జనవరి 10 న విడుదల కాబోతోంది. కనుక సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.
దర్శకుడు బుచ్చిబాబు ఓ క్రీడాంశంతో ఈ సినిమా కధని అల్లుకున్నట్లు తెలుస్తోంది. దానిలో రామ్ చరణ్ పాత్ర ఏమిటనేది ఇంకా తెలియవలసి ఉంది. సాధారణంగా ఇటువంటి కధలతో వచ్చే సినిమాలలో హీరో కోచ్ పాత్రలో నటిస్తుంటాడు. కనుక రామ్ చరణ్ కూడా కోచ్ పాత్ర చేస్తుండవచ్చు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించబోతోంది. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సమర్పిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందించబోతున్నారు.