గర్ల్ ఫ్రెండ్‌ని పరిచయం చేస్తా: విజయ్ దేవరకొండ

December 08, 2024


img

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె దీపావళి పండుగాని విజయ్ దేవరకొండ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.

వారితో కలిసి పుష్ప-2 సినిమా చూశారు కూడా. అయితే వారి ప్రేమ, పెళ్ళి గురించి ఇంతవరకు ఇద్దరూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ రేపు (సోమవారం) విజయ్ దేవరకొండ తన గర్ల్ ఫ్రెండ్‌ని లోకానికి పరిచయం చేయబోతున్నారని గీతా ఆర్ట్స్ ప్రకటించింది. రష్మిక మందన నటించిన గర్ల్ ఫ్రెండ్‌ సినిమా టీజర్‌ని విజయ్ దేవరకొండ విడుదల చేస్తారని అర్దం.

విజయ్ దేవరకొండకి రష్మిక మందన ఎలాగూ గర్ల్ ఫ్రండ్ కనుక అతని చేత టీజర్‌ విడుదల చేయిస్తుండటం సందర్భోచితంగా ఉంది. పనిలో పనిగా తమ ప్రేమ, పెళ్ళి ప్రకటన కూడా చేస్తారేమో? రేపు ఉదయం 11.07 గంటలకు గర్ల్ ఫ్రెండ్ టీజర్‌ విడుదల కాబోతోంది.

రష్మిక మందన, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్ చేస్తున్నారు. 

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష