బచ్చలమల్లి: ముచ్చటగా మూడో పాట

December 07, 2024


img

అల్లరి నరేష్ అల్లరి మానేసి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు అన్ని గంభీరమైన కధలు, పాత్రలు ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు. కానీ త్వరలో మళ్ళీ కామెడీ సినిమాలలో అల్లరి చేస్తానని బచ్చలమల్లి సినిమా ప్రమోషన్స్‌లో చెప్పారు. 

బచ్చలమల్లి సినిమాలో మహా మూర్ఖుడిగా నటించానని చెప్పారు. మహా మూర్ఖుడు కూడా ప్రేమలో పడితే ఎలా ఉంటుందో తెలుసుకోవలంటే ఈ నెల 20న బచ్చలమల్లి వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

బచ్చలమల్లి రెండు పాటలు అందరి ప్రశంశలు అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో పాట విడుదల చేయబోతున్నారు. విశేషమేమిటంటే, డిసెంబర్‌ 9 వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాకినాడ జిల్లాలోని తునిలో రాజా గ్రౌండ్స్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగబోతోంది. ఆ మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఈ మూడో పాటని విడుదల చేయబోతోంది. 

ఈ సినిమాలో రావు రమేష్, కోటా జయరాం, సాయి కుమార్, ధన్‌రాజ్, హరితేజ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.    

ఈ సినిమాకి దర్శకుడు: సుబ్బు మంగదేవి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం నాధన్, ఎడిటింగ్: చోట కె ప్రసాద్, స్క్రీన్ ప్లే: విపర్తి మధు చేశారు.

అల్లరి నరేష్ 63వ సినిమాగా వస్తున్న బచ్చలమల్లిని రాజేష్ దండ, బాలాజీ గుట్ట కలిసి హాస్య మూవీఎస్ బ్యానర్‌పై నిర్మించారు. బచ్చలమల్లి డిసెంబర్ 20 వ తేదీన విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష