కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో ‘కంగువా’ అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిసెంబర్ 8నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించింది. రేపటి నుంచే తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ భాషలలో కంగువా ప్రసారం కాబోతోంది. కానీ హిందీలో ఎప్పటి నుంచో ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా, బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించారు.
శివ దర్శకత్వంలో వచ్చిన కంగువా కధమిటంటే, గోవాలో బౌంటీ హంటర్స్‌గా కాలక్షేపం చేస్తుంటారు ఫ్రాన్సిస్ (సూర్య), ఏంజెలా (దిశా పటానీ). ఒకప్పుడు ప్రేమికులైన వారిరువురూ విడిపోయి ఎవరి దందాలు వారు చేసుకుంటుంటారు.
ఫ్రాన్సిస్ స్నేహితుడు (యోగీబాబు)తో ఓ పని మీద వెళ్ళినప్పుడు జీటా అనే బాలుడిని కలుస్తారు. అతనితో ఏదో తెలియని సంబంధం ఉన్నట్లు ఫ్రాన్సిస్‌కి అనిపిస్తుంటుంది. జీటాకి కొందరి వలన ప్రాణాపాయం ఉందని గ్రహించి అతనిని ఫ్రాన్సిస్ కాపాడుతుంటాడు. ఆ తర్వాత కధ 1070 సంవత్సరాల వెనక్కు వెళ్ళిపోతుంది. దాని గురించి తెలుసుకోవాలంటే కంగువా చూడాల్సిందే.