కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా చేయక మునుపే కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ దర్శకత్వంలో ‘దిల్‌రుబా’ అనే ఓ సినిమా పూర్తి చేశాడు. కానీ అనివార్య కారణాల వలన ఆ సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఇప్పుడు ‘క’ సినిమా సూపర్ హిట్ అవడంతో కిరణ్ అబ్బవరం తన ‘దిల్‌రుబా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట! ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటించింది.
ఇది విడుదలైన వెంటనే మరో సినిమా చేసేందుకు కిరణ్ అబ్బవరం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈసారి దర్శకుడు మారుతి శిష్యుడు రవితో ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని మారుతి స్వంత బ్యానర్‌పై నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ రెండు సినిమాలకి సంబందించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.