ఇకపై తల్లి, భార్య పాత్రలు చేయను: మీనాక్షి

December 01, 2024


img

తెలుగు, తమిళంలో వరుసగా అనేక సినిమాలు చేస్తున్న మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ సినిమాతో మరో విజయం అందుకున్నారు. ఈ సినిమాలో ఆమె సల్మాన్ దుల్కర్ భార్యగా, ఓ బిడ్డ తల్లిగా నటించిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ, కెరీర్ మొదట్లోనే తల్లి, భార్య, అక్క, వదిన పాత్రలు చేస్తే తర్వాత వరుసగా అటువంటి పాత్రలే వస్తాయని బందు మిత్రులు చెప్పారని మీనాక్షి చౌదరి చెప్పారు. 

వారు చెప్పింది నిజమే కనుక ఇకపై తల్లి, భార్య పాత్రలకు దూరంగా ఉంటూ హీరోయిన్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తానని చెప్పారు. ఇక నుంచి కమర్షియల్, యాక్షన్, రొమాంటిక్ చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. 

సినీ పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల జీవితకాలం తక్కువని అందరికీ తెలుసు. కొంత మంది హీరోయిన్లు దీనికి అతీతంగా హీరోలతో సమానంగా దశాబ్ధాల తరబడి సినిమాలు చేస్తున్నప్పటికీ, చాలా మంది హీరోయిన్లకు  పదేళ్ళలోనే అవకాశాలు తగ్గిపోతుంటాయి. 

కొత్త హీరోయిన్లు రాగానే పాత హీరోయిన్లు తల్లి, అక్క, వదిన పాత్రలకు షిఫ్ట్ అయిపోవడమో లేదా అవి చేయడానికి ఇష్టపడక పెళ్ళి చేసుకొని సినిమాలకు దూరం అవుతుంటారు. 

మీనాక్షి చౌదరికి సినీ పరిశ్రమలో ఇలాగే ప్రవేశించారు. ఇలాగే నిష్క్రమిస్తారు. ఈవిషయం ఆమె ఇప్పుడే గ్రహించడం, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకోవడం మంచి నిర్ణయమే. తల్లి, వదిన, అక్క పాత్రలు చేసేందుకు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కూడా.


Related Post

సినిమా స‌మీక్ష