హైదరాబాద్‌లో పుష్పరాజ్ చోటు మార్చాడు తెలుసా?

December 01, 2024


img

ఇవాళ్ళ (ఆదివారం) హైదరాబాద్‌, మల్లారెడ్డి కాలేజీలో పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి యూసఫ్ గూడ, పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలనుకున్నారు. కానీ ఇంత తక్కువ సమయంలో ఏర్పాట్లు పూర్తి చేయడం కష్టమని భావించి పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని సోమవారానికి వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు పుష్ప-2 టీమ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 

ఇతర రాష్ట్రాలలో పుష్ప-2 ప్రమోషన్స్ చాలా అట్టహాసంగానే జరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతుండటం పుష్ప-2 టీమ్‌ని, అభిమానులను కూడా కలవరపరుస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఫెయింజల్ తుఫాను కారణంగా గత రెండు మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

పుష్ప-2 డిసెంబర్‌ 5న విడుదల కావలసి ఉన్నప్పటికీ తెలంగాణలో 4వ తేదీ రాత్రి 9 గంటల షోతోనే ప్రదర్శనలు మొదలవుతాయి.

పుష్ప-2 బుకింగ్స్ జోరుగా సాగుతున్నప్పటికీ సరిగ్గా సినిమా విడుదల కాబోతున్నప్పుడు ఈ తుఫాను, వర్షాలు, చలి గాలులు సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష